సుమంత్ కు చిన్న ఫేవర్ చేయనున్న నాగార్జున !
Published on Nov 26, 2017 12:33 pm IST

‘నరుడా డోనరుడా’ పరాజయంతో డీలాపడిన హీరో సుమంత్ కాస్త గ్యాప్ తీసుకుని సరికొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మళ్ళీ రావా’ అనే సినిమాను చేశారు. డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ చిత్రం యొక్క టైటిల్ ట్రాక్ ను సుమంత్ మేనమామ అక్కినేని నాగార్జున స్వయంగా రిలీజ్ చేయనున్నారు. నాగార్జున చేస్తున్న ఈ చిన్న ఫేవర్ సినిమాకు మరింత ప్రచారాన్ని కల్పించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కు మంచి స్పందన లభించింది. ఇకపోతే సుమంత్ త్వరలో నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం డైరెక్షన్లో కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు.

 
Like us on Facebook