నాగార్జున సినిమా వాయిదాపడిందా ?
Published on Jul 19, 2017 3:29 pm IST


కింగ్ నాగార్జున ఈ మధ్య తమ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేకింగ్ విషయంలో, విడుదల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడంలేదు. ఒకవేళ చేయసం వర్క్ సరిగా రాకపోతే ఎలాంటి మొహమాటం లేయకుండా రీ షూట్ చుస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘రాజుగారి గది -2’ విషయంలో కూడా ఇవే నియమాలు ఫాలో అయ్యారట నాగ్.

సినిమా చిత్రీకరణ కొంత అనుకున్న స్థాయిలో రానందున దర్శకుడు ఓంకార్ ను రీ షూట్ చేయమన్నారట. అంతేగాక సినిమాను ముందుగా నాజుకున్నట్టు ఆగష్టులో కాకుండా అక్టోబర్లో విడుదచేయాలని నిర్మాతలకు సూచించారని, ఇదంతా విజువల్ ఎఫెక్ట్స్ సరిగా లేనందు వలనేనని టాక్ వినిపిస్తోంది. మరి ఈ మాటల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

 
Like us on Facebook