నాగ శౌర్య మూవీపై వస్తున్న పుకార్లకు క్లారిటీ..!

Published on Feb 26, 2020 9:02 pm IST

యంగ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రంపై అనేక రూమర్లు ప్రచారం అవుతున్నాయి. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కిస్తున్న నాగ శౌర్య లేటెస్ట్ మూవీ ఆగిపోయిందని, అశ్వథామ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ చిత్ర నిర్మాతలు సినిమా షూటింగ్ నిలిపివేశారని వార్తలు వచ్చాయి. ఐతే ఈ ప్రచారానికి చిత్ర నిర్మాత వివేక్ కూచిబొట్ల ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా వీటికి సమాధానం చెప్పారు.

అవసరాల శ్రీనివాస్-నాగ శౌర్య మూవీ ఆగిపోయిందన్న వార్తలలో ఎటువంటి నిజం లేదన్న ఆయన 50శాతం షూటింగ్ పూర్తయింది అన్నారు. అలాగే మిగతా షూటింగ్ యూఎస్ లో జరపాల్సివుండగా వీసా కోసం ఎదురుచూస్తున్నాం అన్నారు. సినిమా చాల బాగా వస్తుంది అన్న కూచిబొట్ల సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు అన్నారు.

సంబంధిత సమాచారం :