‘బంగార్రాజు’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున ?
Published on Mar 14, 2018 8:41 am IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి. 2016 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో పంచెకట్టుతో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన దక్కింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు.

ఆ ప్రాజెక్టుకు ‘బంగార్రాజు’ అనే పేరు కూడ పెట్టారు. కానీ కళ్యాణ్ కృష్ణ రెడీ చేసిన స్క్రిప్ట్ అంత సంతృప్తికరంగా లేకపోవడంతో వెనకడుగు వేశారు నాగ్. కానీ ఇప్పుడు కొన్ని మార్పులతో కళ్యాణ్ పక్కా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని, నాగ్ కూడా ఇంప్రెస్ అయ్యారని, ప్రసుతం నాగ్, కళ్యాణ్ కృష్ణలు చేస్తున్న సినిమాలు పూర్తవగానే ‘బంగార్రాజు’ మొదలవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే నాగార్జున , కళ్యాణ్ కృష్ణల నుండి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

 
Like us on Facebook