తన పెళ్లి రూమర్స్ ను ఖండించిన పాపులర్ హీరోయిన్ !

19th, October 2017 - 05:40:45 PM

నమిత.. ఒకప్పుడు తెలుగుతోపాటు తమిళంలో సైతం మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. వెంకటేష్, బాలక్రిష్ణ, ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం ఆఫర్లు
తగ్గుముఖం పట్టడంతో పెద్దగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంలేదు. ఇలాంటి తరుణంలో ఆమె పెళ్లి గురించి ఒక సంచలన వార్త బయటికొచ్చింది. అందులో ఆమె సీనియర్ నటుడు శరత్ కుమార్ ను వివాహమాడనుందనేది సారాంశం.

రెండు మూడు రోజులు ఈ వార్తలు హడావుడి చేశాక శరత్ కుమార్ స్పందిస్తూ అవన్నీ పుకార్లేనని తేల్చారు. ఇక తాజాగా నమిత కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇవన్నీ ఎవరో కావాలని క్రియేట్ చేసినవని, తండ్రి వయసున్న శరత్ కుమార్ ను తాను వివాహం చేసుకోవాలనుకోవడం ఏమిటని, వీటిలో ఏమాత్రం నిజం లేదని అన్నారు. దీంతో ఆమె వివాహంపై చెలరేగిన అనవసర సంచలనానికి ముగింపు దొరికినట్లైంది.