ఎన్టీఆర్ సాంగ్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన బాలయ్య!

Published on Jan 21, 2022 2:00 pm IST

ఎన్టీఆర్ సాంగ్ పై నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా వేదిక గా కీలక వ్యాఖ్యలు చేశారు. నవరస నట సార్వభౌమ, ప్రజాభీష్ట నందమూరి తారక రామ మహ ప్రస్థానం ను పాటగా రచించి, నిర్మించిన అశ్విన్ అట్లూరి గారికి, వారి టీమ్ కి అభినందనలు తెలిపారు బాలకృష్ణ. ఓ ప్రజా నాయక తెలుగు తల్లి పాడుతుంది నీ గీతిక అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాక నందమూరి తారక రామామృత గీతాన్ని అద్బుతం గా ఆదరిస్తున్న అన్నగారి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా బాలకృష్ణ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :