వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమా ‘అ!’. నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాను ద్వారా ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది/
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఏ సట్టిఫికేట్ లభించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాని, రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నాని హీరోగా నటిస్తూనే నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం.


