నానితో క్లాస్ డైరెక్టర్ ఫిక్సేనా ?

Published on May 31, 2019 10:00 pm IST

ఒక సినిమా పరాజయం పాలైతే చాలు, ఆ సినిమా దర్శకుడు ఎంత టాలెంటెడ్ అయినా సరే, ఇక తొందరగా అతనికి అంత తేలిగ్గా అవకాశాలు రావు. ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

ఈ టాలెంటెడ్ దర్శకుడికి మంచి చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్నా.. బ్రహ్మోత్సవం ప్లాప్ తరువాత శ్రీకాంత్ కి మాత్రం మరో సినిమా మొదలుపెట్టడానికి దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల నానితో సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా నానికి వినిపించాడని.. నానికి కథ బాగా నచ్చిందని.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉంటుందని తెలుస్తోంది. మరి సినిమా మొదలవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More