గత వారం థియేటర్స్ లోకి వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి అలాగే హర్ష రోహన్ సహా శివాజీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “కోర్ట్” కూడా థియేటర్స్ లోకి వచ్చింది. మరి మేకర్స్ కి ఉన్న నమ్మకంగా ముందే పైడ్ ప్రీమియర్స్ వేసి సూపర్ హిట్ టాక్ ని మేకర్స్ అందుకున్నారు. ఇలా డే 1 నుంచి క్రేజీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం.
ఇలా లేటెస్ట్ గా యూఎస్ లో 8 లక్షల డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం దాటేయడం విశేషం. ఇంట్రెస్టింగ్ గా ప్రతీ రోజు కూడా సుమారు లక్ష డాలర్స్ మేర ఈ చిత్రం అందుకుంటూ ఉండడం అనేది గమనార్హం. ఇక ఇదే మూమెంట్ కొనసాగితే 1 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు ఈ చిత్రానికి లాంగ్ రన్ లో దక్కవచ్చు. మరి చూడాలి ఈ చిత్రం ఎక్కడ ఆగుతుంది అనేది. ఇక ఈ చిత్రానికి నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
#Court crosses $800K+ at the USA Box Office????????????#CourtTelugu continues its dominance????
BLOCKBUSTER VERDICT! ????@NameisNani @PriyadarshiPN @walpostercinema pic.twitter.com/cbYjJgMHfU
— Prathyangira Cinemas (@PrathyangiraUS) March 19, 2025


