యూఎస్‌లో భారీ ఓపెనింగ్స్‌పై కన్నేసిన నాని!
Published on Jan 31, 2017 10:05 am IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చగా, టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వరుసగా ఐదు హిట్స్ తర్వాత నాని నటించిన సినిమా కావడంతో, ఈ సినిమాతో నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

ఇక నానికి పెద్ద మార్కెట్స్‌లో ఒకటైన యూఎస్ బాక్సాఫీస్ వద్ద నేను లోకల్ మంచి వసూళ్ళు రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి నాని సోలో హీరోగా యూఎస్‌లో తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ ఏర్పరుచుకున్నారు. దీంతో సుమారు 125లొకేషన్స్‌లో సినిమా విడుదలవుతోంది. ఇక గురువారం రోజునే మొదలయ్యే యూఎస్ ప్రీమియర్స్‌కు నాని స్వయంగా హాజరవుతూ ఉండడంతో ఓపెనింగ్స్ బాగుంటాయని ఊహించొచ్చు. నాని స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ‘సినిమా చూపిస్తా మావా’ ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ నాని సరసన హీరోయిన్‌గా నటించారు.

 
Like us on Facebook