ఓటిటిలో “హాయ్ నాన్న” ర్యాంపేజ్.!

ఓటిటిలో “హాయ్ నాన్న” ర్యాంపేజ్.!

Published on Jan 7, 2024 12:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా “హాయ్ నాన్న” కూడా ఒకటి. మరి నాని కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 30వ ప్రాజెక్ట్ గా ఇది రాగ తాను క్లాస్ చిత్రంతో కూడా మంచి వసూళ్లు సాధించి లాభాలు అందించాడు.

ఇక ఈ చిత్రం ఓటిటిలో రీసెంట్ గానే రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అయితే అదరగొడుతుంది. మరి ఇండియా వైడ్ గా కూడా ప్రస్తుతం టాప్ 10 లిస్ట్ లో ఈ చిత్రం మొత్తం 3 స్థానాల్లో ట్రెండ్ అవుతుంది.

మరి నెంబర్ 1 ప్లేస్ లో అయితే తెలుగు వెర్షన్ ట్రెండ్ అవుతుండగా హిందీ వెర్షన్ టాప్ 5 లో ఉంది అలాగే తమిళ్ వెర్షన్ వచ్చి టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది. దీనితో ఈ చిత్రం ఓటిటిలో అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి హేషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా వైరా ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు