అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాని !

‘అష్టా చమ్మా’ సినిమాతో నాని, అవసరాల శ్రీనివాస్ ల కెరీర్లు ప్రారంభమయ్యాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రానుందని సమాచారం. నాని హీరోగా నటించే ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నాడు. నాని కోసం సహజంగా ఉండే ఓ కథను సిద్ధం చేశాడట నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం ఈ మూవీకి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నాని ప్రస్తుతం ద్విపాత్రాభినయం చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్ తరువాత అవసరాల శ్రీనివాస్ తో నాని చెయ్యబోయే సినిమా మొదలుకానుందని సమాచారం.