మూడు పండగలకి మూడు సప్రైజులు ఇవ్వనున్న నాని !
Published on Jan 13, 2018 12:47 pm IST


సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమాల సందడి ఎక్కువవుతుంది. అభిమానులంతా తమ హీరోల సినిమాలకు సంబందించిన విశేషాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకే హీరోలు సంక్రాంతికి రాబోయే తమ సినిమాల గురించిన ఏదో ఒక విశేషాన్ని బయటపెడుతుంటారు. హీరో నాని ఇప్పుడు ఆ పని మీదే ఉన్నారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తన ‘కృష్ణార్జున యుద్ధం’ గురించిన అప్డేట్స్ ను ఒక్కో పండక్కి ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడింటిని బయటపెట్టనున్నారు. ముందుగా రేపు 14వ తేదీ భోగి రోజు ‘కృష్ణార్జున యుద్ధం’ లో తాను చేస్తున్న కృష్ణ పాత్ర యొక్క ఫస్ట్ లుక్ ను, 15వ తేదీ సంక్రాంతినాడు అర్జున్ పాత్ర ఫస్ట్ లుక్ ను, 16 కనుమనాడు సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయనున్నారు. మెర్లపక గాంధీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి హిపాప్ తమిజా సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook