యంగ్ హీరో నాని మొట్ట మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తూ, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘జెండాపై కపిరాజు’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో ముందే రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అయినా ఈ సారి చెప్పిన తేదీకి పక్కాగా రిలీజ్ అవుతోంది. మార్చి 21న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ ని నిన్న నాని మరియు ఈ చిత్ర టీం చూసారు. ఈ సినిమా చూసిన తర్వాత నానికి, ఈ చిత్ర నిర్మాతలైన రజిత్ పార్ధసారధి, శ్రీనివాసన్ లకి ఈ సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెంట్ వచ్చింది.
అలాగే జెండాపై కపిరాజు తెలుగు వెర్షన్ కి తమిళ వెర్షన్ కి మార్పులు చేసారు. ముఖ్యంగా రీ రికార్డింగ్ ని పూర్తిగా మార్చడమే కాకుండా సీన్స్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసారు. దాంతో ఈ సినిమా చాలా బాగుందని, తెలుగు ఆడియన్స్ కి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని నాని, నిర్మాతలు రజిత్ పార్ధసారధి, శ్రీనివాసన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉన్న ఈ మూవీకి సముద్ర ఖని డైరెక్టర్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.


