షూటింగ్ పూర్తి చేసుకున్న నాని “అంటే సుందరానికి”

Published on Jan 23, 2022 11:43 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై. రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వరుస సినిమాలు అనౌన్స్ చేసిన హీరో నాని తాజాగా అంటే సుందరానికి చిత్రం షూటింగ్ పై తాజాగా ఒక అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో ను పోస్ట్ చేశారు. నజ్రియ నజిం హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :