ఈరోజు రాత్రి నుండి ఓటిటి లో నాని “దసరా”

ఈరోజు రాత్రి నుండి ఓటిటి లో నాని “దసరా”

Published on Apr 26, 2023 3:30 PM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. ఈరోజు రాత్రి నుండి దసరా మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.

తెలుగు తో పాటుగా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. దీక్షత్ శెట్టి, సముద్ర ఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు