ఫిబ్రవరికి రానున్న నాని ‘కృష్ణార్జున యుద్ధం’ !


ఈ మధ్యే ‘నిన్ను కోరి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని వరుసగా 7వ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నాని తన తర్వాతి రెండు సినిమాలను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. వాటిలో శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా మేర్లకపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ మధ్యే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంది.

సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారట. అయితే పక్కా విడుదల తేదీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రంలో నాని డ్యూయెల్ రోల్ లో కనిపించనుండటంతో అందరిలోనూ సినిమా పట్ల ఆసక్తి ఎక్కువైంది. ఈ సినిమాలో నానికి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇకపోతే నాని, నాగార్జునల మల్టీ స్టారర్ కూడా నిన్ననే ఖాయమైపోయింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు.