టీజర్ విడుదలకు సిద్దమైన నాని ‘ఎం.సి.ఏ’ !
Published on Nov 8, 2017 5:12 pm IST

నేచ్యురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి'(ఎం.సి.ఏ). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నానికి జంటగా ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి నటిస్తోంది. ఫస్ట్ లుక్ తోనే మంచి స్పందనను తెచ్చుకున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రం యొక్క టీజర్ ను నవంబర్ 10న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్ మూడవ వారంలో విడుదలకానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నాని, సాయి పల్లవి లాంటి ఇద్దరు సూపర్ టాలెంటెడ్ నటీనటులు నటిస్తుండటంతో చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 
Like us on Facebook