ఇది “క్రాక్” దర్శకుడికి నారా లోకేష్ స్పెషల్ విషెషే మరి.!

Published on Mar 13, 2021 2:00 pm IST

అసలు ఈ ఏడాది సినిమా సందడి మొదలు అయ్యిందే మాస్ మహా రాజ్ రవితేజ చేసిన పక్కా మాస్ ఎంటెర్టైనెర్ “క్రాక్” నుంచి అని అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రాన్ని అంత అదిరిపోయే రేంజ్ లో తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఇండస్ట్రీ వర్గాలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాయి.

మరి ఇదిలా ఉండగా నేడు ఈ దర్శకుడి జన్మదినం కావడంతో ఇండస్ట్రీ వర్గాలు నుంచి శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ సందర్భంలో ప్రముఖ రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ యువ నేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా స్పెషల్ విషెష్ తెలియజేసారు.

అయితే ఇది స్పెషల్ ఎందుకు అయ్యిందంటే గోపీచంద్ కు విషెష్ చెప్పడమే కాకుండా అతను తీసిన “క్రాక్” సినిమా చూసి అమితంగా ఎంజాయ్ చేసానని కూడా లోకేష్ తెలిపాడు. అంతే కాకుండా తనకు మున్ముందు ఇలాంటి హిట్స్ చెయ్యాలని ఆకాంక్షిస్తూ తన ఈ దర్శకుడికి తెలిపాడు. మరి ఇలా సినిమా చూసి పుట్టినరోజు నాడు ఆ దర్శకునికి అభినందనలు తెలపడం విశేషమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :