నారా రోహిత్ పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు !
Published on Mar 14, 2018 10:36 am IST

యువ హీరోలు చాలా మంది రొటీన్ రెగ్యులర్ కథల్ని పక్కనబెట్టి భిన్నమైన ప్రాజెక్ట్స్ చేయడానికే మొగ్గుచూపుతున్నారు. అలాంటి హీరోల్లో నారా రోహిత్ కూడ ఒకరు. ఇన్నాళ్లు రెగ్యులర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అయన ఈసారి ప్రయోగాత్మక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ మాటలురాని వ్యక్తిగా కనిపించనున్నాడు.

అది కూడా కాసేపు కాదు సినిమా మొత్తం అలానే ఉంటాడట. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మంజునాథ్ డైరెక్ట్ చేయనున్నారు. శ్రీవైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ పై నారాయణరావు అట్లూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది రోజున చిత్రం అధికారికంగా లాంచ్ కానుంది.

 
Like us on Facebook