సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్న నారా రోహిత్ !
Published on Jul 11, 2017 1:35 pm IST


యంగ్ హీరో నారా రోహిత్ సరికొత్తగా కనిపిస్తున్నారు. గతంలో కంటే బాగా బరువు తగ్గి నెక్స్ట్ సినిమాకి సిక్స్ ప్యాక్ లో కూడా కనిపించవచ్చు అనే హింట్ ఇచ్చారు. ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత పూర్తిగా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన అయన రకరకాల డైట్స్, వర్క్ ఔట్స్ ఫాలో అవుతూ సుమారు 21 కిలోల వరకు బరువు తగ్గి ఇంకో 5 కిలోల వరకు తగ్గడం తన టార్గెట్ అని అన్నారు.

ఇదంతా ఎందుకోసం అంటే సినిమా కోసమేనట. నూతన దర్శకుడు పవన్ మలెల్ల డైరెక్షన్లో రోహిత్ ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను రోహిత్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేస్తారట. అందులోనే ఆయన తన సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించే ఛాన్స్ లేకపోలేదు. ఇకపోతే రోహిత్ పోలీసాఫీసర్ గా నటించిన మల్టీ స్టారర్ ‘శమంతకమణి’ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook