‘కుమారి శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్ చేసిన నాచురల్ స్టార్ నాని

Published on Sep 22, 2023 10:30 pm IST

అందాల నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో గోమఠేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు ట్రైలర్ ని హీరో నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. నిత్యామీనన్ తల్లిగా సీనియర్ నటి గౌతమి నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 28న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో పలు భాషల్లో ప్రసారం కానుంది.

ఇక కుమారి శ్రీమతి ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. పెళ్లి పట్ల ఆసక్తి లేని ఇటికెలపూడి శ్రీమతి, ఎలాగైనా తన తాతయ్య ఇంటిని తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో లైఫ్ లో కష్టపడుతూ చేసే ప్రయత్నమే ఈ సిరీస్ యొక్క కథాంశం అని అని మనకు ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. స్వప్న సినిమాస్, ఎర్లీ మూన్ టేల్స్ సంస్థల పై స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సిరీస్ ని గ్రాండ్ గా నిర్మించగా కీలక పాత్రల్లో తాళ్లూరి రామేశ్వరి, మురళి మోహన్, తిరువీర్, నిరుపమ్, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్ తదితరులు నటించారు. మరి ఈ సిరీస్ ఎంతవరకు ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :