లవ్ మౌళి: ప్రేయసిని పరిచయం చేసిన నవదీప్..!

Published on Feb 15, 2022 2:04 am IST

టాలీవుడ్ హీరో నవదీప్ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం “లవ్ మౌళి”. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమాలో నవదీప్ సరసన నటించే హీరోయిన్‌ని పరిచయం చేశారు మేకర్స్. హీరోయిన్ లుక్ ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపింది.

బాలీవుడ్ నటి పంఖురి గిద్వానీని ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తెలుగులో ఇది ఆమెకు మొదటి సినిమా కాగా ఇందులో చిత్ర అనే పాత్రలో ఆమె నటించబోతుంది. కర్లీ హెయిర్‌లో ఆమె ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇందులో నవదీప్ కూడా గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో కాస్త భిన్నంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :