మొదటి సినిమాతోనే ఓవర్సీస్‌లో మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో

Published on Jun 30, 2019 7:18 pm IST

ప్రస్తుతం పరిశ్రమలో గట్టిగా వినిపిస్తున్న పేరు నవీన్ పోలిశెట్టి. నటుడిగా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే చేసిన నవీన్ స్వరూప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా తెర మీదికొచ్చాడు. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో నవీన్ నటనకు గాను ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అతనిలోని కామెడీ టైమింగ్ అందరికీ బాగా నచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చిత్ర వసూళ్లు ఇప్పటి వరకు రూ.10 కోట్లకు చేరువవగా ఓవర్సీస్‌లో కూడా మెచ్చుకోదగిన రీతిలోనే పెర్ఫార్మ్ చేస్తోంది.

ఇప్పటి వరకు 250,000 డాలర్లను రాబట్టింది. విజయవంతంగా రెండవ వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా ఇంకో వారం పాటు మంచి రన్ కనబరిచే అవకాశాలున్నాయి. ఇలా మొదటి సినిమాతోనే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఇక మీదట కూడా ఇలాంటి భిన్నమైన సినిమాలే చేస్తూ వెళితే త్వరలోనే మిలియన్ మార్క్ వసూళ్లను అందుకోగల సత్తా ఉన్న హీరోగా నిలదొక్కుకోవడానికి ఛాన్సుంది.

సంబంధిత సమాచారం :

More