మెగాస్టార్ “గాడ్ ఫాదర్” కోసం నయనతార భారీ రెమ్యునరేషన్!

Published on Nov 19, 2021 8:00 pm IST

మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం లో నయనతార నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక చిత్ర యూనిట్ సైతం నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

అయితే ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియా లో మరియు ఫిల్మ్ నగర్ లో చర్చాంశ నీయంగా మారింది. గాడ్ ఫాదర్ చిత్రం కోసం నయనతార 4 కోట్ల రూపాయల రెమ్యురేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక మేకర్స్ సైతం అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు లో ఇప్పటి వరకూ కూడా ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. నయనతార లేడీ సూపర్ స్టార్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం లో మరింత వెయిట్ ఉన్న పాత్ర కావడం తో మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :