పెళ్లి కోసమేనా ఈ దర్శనాలు !

Published on Sep 27, 2021 3:00 pm IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. అయితే, వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర నుండి వీరి పెళ్లి అంటూ ఇప్పటికే అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే తాజాగా విఘ్నేష్‌ శివన్‌ – నయనతార తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక ఇప్పటికే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. త్వరలోనే దాంపత్య బంధానికి స్వాగతం పలకాలనే ఉద్దేశ్యంతోనే ఇద్దరు తిరుమలకు వచ్చారని తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కేరళలోని ఓ చర్చలో ఈ జోడీ వివాహం జరగబోతుందని కూడా ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. ఏది ఏమైనా ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :