తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి నయన తార. ఆమె ప్రస్తుతం తమిళ బాషలో నటిస్తున్న చిత్రం ‘కొలమావు కోకిల’ (కోకో). నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్ర ట్రైలర్ జులై 5న విడుదలకానుంది. ఇక ఆమె ఈచిత్రంలో డ్రగ్స్ అమ్మే యువతి పాత్రలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర వీడియో సాంగ్ రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది.
నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈనెల చివరి వారంలో ప్రేక్షకులముందుకు రానున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి.


