డ్యూయెల్ రోల్లో నటిస్తున్న నయన్ !

Published on Oct 9, 2018 8:19 pm IST

ఈ ఏడాది ‘కొలమావు కోకిల, ఇమ్మైక నొడిగళ్’ చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకొని ఫుల్ జోష్ లో వుంది అగ్ర హీరోయిన్ నయనతార. ఈచిత్రాలు నయన్ కు కెరీర్ పరంగా బాగానే ఉపయోగపడ్డాయి. ఇక ఈ చిత్రాల తరువాత ప్రస్తుతం ఆమె తన 63 వ చిత్రం ‘ఐరా’ లో నటిస్తుంది. సర్జున్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నయన్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుంది రెండు పాత్రల్లో నటించడం ఆమె కు ఇదే మొదటి సారి కావడం విశేషం.

ఇక కొద్దీ సేపటి క్రితం విడుదలైన ఈచిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రం ఫై మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈచిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదలకానుంది. ప్రతిష్టాత్మక కేజేఆర్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈచిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :