ప్రత్యేక విమానంలో దిగిన నయనతార

Published on Apr 27, 2021 8:31 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ చిత్రం ఈమధ్యనే రీస్టార్ట్ అయింది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. అన్ని రకాల జాగ్రత్తల మధ్యన చిత్రీకరణ జరుపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. రజినీకాంత్ కూడ పూర్తిగా సహకరిస్తుండటంతో టీమ్ శరవేగంగా పని పూర్తి చేస్తున్నారు. హీరోయిన్ నయనతార సైతం చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ చేరుకున్నారు.

ఈమధ్య ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్న నయనతార హైదరాబాద్ కు కూడ ప్రత్యేక విమానంలోనే రావడం జరిగింది. సినీ వర్గాల సమాచారం మేరకు మే 10 వరను ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుగుతుందట. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్‌ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. రజినీకి జోడీగా నయనతార నటిస్తుండగా కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ఏడాది మధ్యలోకి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్ర బృందం.

సంబంధిత సమాచారం :