“నేనే నా” చిత్రం నుండి సరికొత్త పోస్టర్ విడుదల!

Published on Aug 18, 2021 12:42 pm IST


రెజీనా కాసాండ్రా, అక్షర గౌడా ప్రధాన పాత్రల్లో కార్తీక్ రాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం నేనే నా. ఈ చిత్రం తమిళం మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొగా, తాజాగా విడుదల అయిన పోస్టర్ సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వెన్నెల కిషోర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. శామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి గోకుల్ బెనాయ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :