లేటెస్ట్..”శాకుంతలం” కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Published on Feb 10, 2023 1:29 pm IST

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన తన లాస్ట్ సినిమా “యశోద” తో తన కెరీర్ లో భారీ హిట్ అందుకోగా దీని తర్వాత సమంత నుంచి రానున్న లేటెస్ట్ చిత్రం “శాకుంతలం” కూడా ఒకటి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా దీనిని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా మాత్రం రిలీజ్ డేట్ కి వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఫైనల్ ఆ అయితే మేకర్స్ ఇప్పుడు సరికొత్త డేట్ ని అనౌన్స్ చేశారు. నిజానికి ఈ ఫిబ్రవరి రెండో వారం లోనే రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రం వచ్చే నెల ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సినిమాలో సమంత మరో అద్భుతమైన రోల్ లో నటించగా తన కి మేల్ లీడ్ లో దేవ్ మోహన్ నటించాడు. అలాగే మణిశర్మ సంగీతం అందించగా దిల్ రాజు మరియు గుణ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :