హీరోయిన్ పెళ్లి పై మళ్ళీ మరో పుకారు !

Published on Jul 19, 2021 12:34 pm IST

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లి పై ఇప్పటికే అనేక రకాలుగా పుకార్లు పుట్టించారు. తాజాగా, త్రిష పెళ్లికి సంబంధించిన మరో రూమర్ వినిపిస్తోంది. త్వరలోనే త్రిష, ఓ తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని తమిళ మీడియా వర్గాల్లో ఓ వార్త బాగా హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తలోనైనా వాస్తవం ఉందా ? లేక, ఎప్పటిలాగే ఇది కూడా రూమరేనా అనేది చూడాలి.

కాగా తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు అయితే లేవు. అందుకే, కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు త్రిష రెడీ అయింది. ఈ క్రమంలోనే వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత త్రిష మళ్ళీ పెళ్లి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ చాల నెలలు తరువాత త్రిష పెళ్లి అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :