ఎన్టీఆర్ సరసన అమెరికన్ నటి.. నిజమేనా ?

Published on Jul 24, 2019 1:04 am IST

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఆర్ఆర్ఆర్’. మొదట ఇందులో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్, ఎన్టీఆర్ స‌ర‌స‌న బ్రిట‌న్ భామ డైసీ ఎడ్గ‌ర్గ్ జోన్స్‌ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. కానీ డైసీ ఎడ్గర్గ్ జోన్స్ కొన్ని కుటుంబపరమైన కారణాల రీత్యా సినిమా నుండి తప్పుకున్నట్టు ప్రకటించింది.

అప్పటి నుండి ఎన్టీఆర్ జోడీ కోసం దర్శక నిర్మాతలు తెగ వెతుకుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, ఇతర భాషల పరిశ్రమలను జల్లెడపట్టారు. చివరికి అమెరిక‌న్ న‌టి, సింగ‌ర్ ఎమ్మా రొబ‌ర్ట్స్‌ను ఎంపిక చేసుకున్నార‌ని వార్త‌లు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్త నిజమేనా కాదా అని వాకబు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో తెలియాలంటే జక్కన్న టీమ్ నుండి ప్రకటన రావాల్సిందే. ఇకపోతే రూ.350 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More