ధనుష్ “సార్”కి కొత్త కష్టం..!

Published on Jan 27, 2022 3:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా మొట్ట మొదటి సారిగా తెలుగులో చేస్తున్న తాజా చిత్రం “సార్”. యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చినట్టు తెలుస్తుంది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమాకి పనిచేస్తున కెమెరామెన్ దినేష్ కృష్ణన్ సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం. కొత్త కెమెరామెన్ కోసం మేకర్స్ వెతుకుతున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :