రెండో రోజుకు తగ్గిన “డిస్కో రాజా” కలెక్షన్స్ !

Published on Jan 26, 2020 8:46 pm IST

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.9 కోట్ల పైగా షేర్ ను రాబట్టిన ఈ సినిమా, రెండో రోజు కూడా పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. రవితేజ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాకి వస్తోన్న కలెక్షన్స్ చాల తక్కువే అని చెప్పాలి.

అయితే రవితేజ తన ఆటిట్యూడ్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా సినిమాలో బాగా ఆకట్టుకున్నాడు. కానీ దర్శకుడు ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోకపోవడం, పైగా డిస్కో రాజా క్యారెక్టరైజేషన్ అండ్ రవితేజ రెండు పాత్రల మధ్య ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. కాగా ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More