మే నుండి ‘అలిమేలు మంగ’ స్టార్ట్ కానుంది !

Published on Apr 4, 2021 11:00 pm IST

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రాబోతున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా మే నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం చేస్తోన్న సిటీమార్ ఇప్పటికే ఫస్ట్ కాపీతో రిలీజ్ కి రెడీ అవుతుంది. అందుకే ‘అలిమేలుమంగ వేంకటరమణ’ కోసం గోపీచంద్ డేట్స్ కేటాయించాడట. ఇక తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ ‘ఒక హీరో’గా చేస్తోన్న మొదటి సినిమా ఇది.

కాగా తేజ, గోపీచంద్‌ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో రూపొందనున్న సినిమా కోసం తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడట. అయితే ఇంతకీ అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను తేజ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :