ఉస్తాద్ భగత్ సింగ్ : ట్రెండీ లుక్‌లో మాస్ అవతారమెత్తిన పవన్ కళ్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ : ట్రెండీ లుక్‌లో మాస్ అవతారమెత్తిన పవన్ కళ్యాణ్

Published on Jan 1, 2026 10:05 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఓ కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోడీ మరోసారి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రెడ్ షర్ట్‌కు డెనిమ్ జత చేసి, గబ్బర్ సింగ్ రోజులను గుర్తు చేసే స్టైల్‌లో పవర్ స్టార్ కనిపించడం అభిమానులను ఫిదా చేస్తోంది. ఒక చేతిలో లాంగ్ గన్, మరో చేతిలో రేడియో పట్టుకుని ఉన్న పవన్ లుక్‌లోని స్వాగ్, చార్మ్ మాస్ ప్రేక్షకులకు పక్కా ట్రీట్‌ని హామీ ఇస్తోంది.

పవన్ కళ్యాణ్‌ను అత్యంత హీరోయిక్‌గా, స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడంలో దిట్ట అయిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ పోస్టర్‌తో మరోసారి తన మార్క్ చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌లోనూ పవన్ కరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అయ్యేలా ఆయన తీసుకున్న శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన తొలి సింగిల్ ‘దేఖేంగే సాలా’ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు