టాలీవుడ్‌కు మరో యంగ్ విలన్ దొరికేశాడుగా..!

Published on Sep 8, 2021 12:07 am IST


సీనియర్ నటి జయసుధ తనయుడు శ్రేయాస్ ఆరేళ్ల కిందట ‘బస్తీ’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అతను నటనకు గుడ్‌బై చెప్పాడు. అయితే జయసుధ మరో కుమారుడు నిహార్ కపూర్ మంచి ఎత్తు ఉండడంతో అతనితో విలన్ పాత్రలు చేయించాలని చాలా మంది సలహాలు ఇచ్చారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే నిహార్ కపూర్ ఇప్పుడు విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు.

లక్ష్ చదలవాడ, వేదిక దత్ హీరో హీరోయిన్లుగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ చిత్రంలో నిహార్ విలన్ పాత్ర పోశిస్తున్నాడు. నేడు నిహార్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కోపంతో రగిలిపోతూ చేతిలో కత్తి పట్తుకుని కూర్చుని ఉన్న నిహార్‌ను చూస్తుంటే టాలీవుడ్‌కు మరో యంగ్ విలన్ దొరికేశాడన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరీ తన విలనిజంతో నిహార్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడనేది.

సంబంధిత సమాచారం :