ముద్ర టైటిల్ లోగో ఫై నిఖిల్ సీరియస్ !

Published on Jan 24, 2019 2:52 pm IST


యంగ్ హీరో నిఖిల్ , లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంన్నఈచిత్రం త్వరలోనే విడుదలకానుంది. ఇక ఇదే టైటిల్ మరియు లోగో తో బుకింగ్ సైట్స్ లో మరో చిత్రం దర్శనమిచ్చింది. రేపు విడుదలకానున్న ఈ చిత్రానికి నిఖిల్ నటించిన ముద్ర సినిమా లోగో తో పాటు క్యాస్టింగ్ లో ఆయన పేరును కూడా చేర్చారు. బజ్ క్రియేట్ చేయడానికి కొందరు కావాలని ఈ వింధంగా చేశారు. దాంతో చాలా మంది ఇది నిఖిల్ నటించిన ముద్ర అనుకోని టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇది కాస్త నిఖిల్ కంట పడేసరికి దీనిపై ఆయన స్పందించారు.

గాయ్స్ .. నా సినిమా ఈ వారంలో రిలీజ్ కావట్లేదని కొందరు కావాలని నా సినిమా లోగో మరియు నా పేరును వాడుకొని బుకింగ్ యాప్స్ లోపెట్టారన్నడు అలాగే మా నిర్మాతలు దీనిపై చర్యలు తీసుకుంటారని త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తానని ఇది అవమానకరమని నిఖిల్ ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :

X
More