నిఖిల్ సినిమాకు ఇంకా కష్టాలు తీరలేదా ?

Published on Jul 23, 2019 2:03 am IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన కొత్త చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ సినిమాకు ఇంకా కష్టాలు తొలగలేదు. మొదట్లో ‘ముద్ర’ అనే టైటిల్ పెట్టగా వేరే సినిమాతో వివాదమై దాన్ని ‘అర్జున్ సురవరం’గా మార్చారు. ఆ తర్వాత మే 1న సినిమా వస్తుందనుకుంటే అది వాయిదాపడింది. ఆ తరవాత కూడా పలుసార్లు తేదీని మార్చారు. ట్రైలర్ బాగుండటంతో సినిమా త్వరగా రిలీజైతే చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

కానీ ఇప్పటికీ ఆ సినిమా కష్టాలు తొలగినట్టు కనిపించట్లేదు. తాజాగా హీరో నిఖిల్ ట్విట్టర్లో స్వచ్ఛంగా బయటకు రావాలంటే మండాల్సి ఉంటుంది అన్నారు. దాంతో పాటే సినిమా స్టిల్ యాడ్ చేశారు. ఈ స్టేట్మెంట్ చూస్తుంటే సినిమా ఇంకా సమస్యల పరిష్కారానికి ఇంకా సమయం పట్టేలా ఉందని అనిపిస్తోంది. మరి ఆ సమస్యలు తీరి చిత్రం ఎప్పుడు బయటికొస్తుందో చూడాలి. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :