నితిన్ సరసన నిఖిల్ హీరోయిన్ !

ప్రస్తుతం నితిన్ ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్నతో కలిసి ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా కన్నడనటి, నిఖిల్ సూపర్ హిట్ చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’తో తెలుగు తెరకు పరిచయమైన నందిత శ్వేత నటించనుందని వినికిడి. నిఖిల్ సినిమాలో ఈమె నటనకుగాను ప్రేక్షకులు, విమర్శకులు మంచి మార్కులే వేశారు.

ఆ చిత్రం తరవాత ఆమెకు మంచి ఆఫర్లు తలుపుతట్టాయి. సతీష్ వేగేశ్న కూడా ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’, ఆమె నటించిన ఇతర తమిళ చిత్రాల్లో ఆమె నటనను చూసి ఆమెను నితిన్ కు జోడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.