“వి” తరహాలోనే “నిశ్శబ్దం” స్ట్రీమింగ్ కూడా.!

Published on Sep 19, 2020 8:00 am IST

గత కొంత కాలం నుంచి సస్పెన్స్ గా నడుస్తున్న “నిశ్శబ్దం” చిత్రం స్ట్రీమింగ్ నిన్నటితో ఒక కొలిక్కి వచ్చింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం తాలుకా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకొని వచ్చే అక్టోబర్ 2 న డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే అనుష్క నటించిన ఈ క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం కూడా నాని నటించిన లేటెస్ట్ క్రైమ్ రివెంజ్ డ్రామా “వి” తరహాలోనే స్ట్రీమింగ్ కు రానున్నట్టు సమాచారం. అంటే వి చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 5 న స్ట్రీమింగ్ కు తీసుకొస్తామన్నారు అంటే సరిగ్గా రాత్రి 12తో 5వ తారీఖుగా కానీ నిజానికి నాలుగో తారీఖు రాత్రి 10 గంటలకే స్ట్రీమింగ్ కు ఇచ్చేసారు.

అదే విధంగా ఈ నిశ్శబ్దం చిత్రాన్ని కూడా ముందు రోజు రాత్రే అయితే 9 గంటల 30 నిమిషాలకు లేదా 10 గంటలకు కానీ ముందు గానే ప్రీమియర్స్ పడనున్నట్టు సమాచారం. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ మేల్ లీడ్ లో నటిస్తుండగా అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

More