నితిన్ కొత్త చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ నేడే!

Published on Sep 10, 2021 12:40 pm IST


నితిన్ వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తను హీరో గా నటిస్తున్న 31 వ చిత్రం కి సంబంధించిన టైటిల్ ను నేడు చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

వినాయక చవితి శుభాకాంక్షలతో నితిన్ 31 వ చిత్రం టైటిల్ ను ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి మోషన్ పోస్టర్ తో ప్రకటించడం జరుగుతుంది. ఈ చిత్రం లో నితిన్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించనుంది. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. అంతేకాక ఎడిటర్ గా పలు చిత్రాలకి పని చేసిన శేఖర్ ఈ చిత్రం తో దర్శకుని గా మారనున్నారు. అంతేకాక నితిన్ 31 అంటూ విడుదల చేసిన ప్రకటన పోస్టర్ అందరిను ఆకట్టుకోవడం తో, సినిమా టైటిల్ మరియు ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :