ఆ ఘనత సాధించిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నితిన్ రికార్డ్..!

Published on Feb 27, 2022 3:00 am IST

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. శాటిలైట్‌గా కాకుండా యూట్యూబ్‌లో కూడా తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్‌లకు తెగ వ్యూస్ వస్తున్నాయంటేనే ఈ క్రేజ్ ఏ పాటిగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ యూట్యూబ్‌లో తన హిందీ డబ్బింగ్ చిత్రాల ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

యూట్యూబ్‌లో నితిన్ హిందీ డబ్బింగ్ చిత్రాలన్నిటికి కలిపి 2.3 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ ఘనత సాధించిన మొదటి మరియు ఏకైక సౌత్ ఇండియన్ హీరో నితిన్. అయితే నితిన్ తెలుగులో చేసిన సినిమాలన్నీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం భారీ మొత్తాలను వసూలు చేయడంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :