ఇంటర్వ్యూ : నితిన్ – ఇకపై నా ప్రతి సినిమాలో పవన్ గారి రిఫరెన్స్ ఉంటుంది !
Published on Aug 7, 2017 6:30 pm IST


దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత హీరో నితిన్ ‘లై’ చిత్రంతో ఈ శుక్రవారం మన ముందుకురానున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ప్ర) అ.. ఆ తర్వాత ఇంట గ్యాప్ ఎందుకొచ్చింది ?
జ) ‘అ..ఆ’ హిట్ తర్వాత నేను 2 నెలలు ఏం ఆలోచించలేకపోయాను. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. దీంతో నా గురువు త్రివిక్రమ్ ను సలహా అడిగాను. ఆయన నా ఇమేజ్ ను పూర్తిగా మార్చేసి మార్కెట్ స్థాయిని అలాగే నిలబెట్టే సినిమా చేయమన్నారు. అప్పుడే హను ‘లై’ స్క్రిప్ట్ తో వచ్చాడు. ఆ తర్వాత అన్నీ వాటంతట అవే జరిగిపోయాయి.

ప్ర) అసలు ఈ ‘లై’ దేని గురించి ?
జ) ఈ ఈ థీమ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాన్ని చెప్పడం కూడా స్టైలిష్ గా చెప్పారు. అర్జున్ కి, నాకు మధ్య గొడవ బాగుంటుంది. ఇందులో ను యూఎస్ లో ఇటిలవ్వాలని ప్రయత్నించే కుర్రాడిగా కనిపిస్తాను. నేను యూఎస్ వెళ్ళాక ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాను అనేదే సినిమా.

ప్ర) ఎందుకు యూఎస్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకుని ఎక్కువ ఖర్చుపెట్టారు ?
జ) ఇప్పటికే నా రెండు సినిమాలని యూరప్లో చేశాను. అందుకే ఈసారి యూఎస్ ను ఎంచుకున్నాం. ఈసినిమా కోసం ఇంతలా ఖర్చు పెట్టిన 14 రీల్స్ నిర్మాతలకి థాంక్స్ చెప్పాలి. యూఎస్ లోని బెస్ట్ లొకేషన్స్ లో చిత్రీకరించాం. లాస్ వేగాస్ లో ఉన్న ఒక కెసినోలో 3 గంటలకు 25 లక్షలు పే చేసి షూట్ చేశాం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది.

ప్ర) అర్జున్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ) ఆయనతో శ్రీ ఆంజనేయం చేశాను . ఆయన అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఇంకా బలంగా తయారయ్యారు. క్లైమాక్స్ లో మా ఇద్దరి మధ్య ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుంది. అది ఫ్లై మీద జరుగుతుంది. నాకిప్పటికీ గుర్తు ఆ కఠినమైన పరిస్థితుల్లో, వాతావరణంలో, చలి గాలిలో షూట్ చేయడానికి టీమ్ అంతా కష్టపడ్డాం.

ప్ర) కొత్త హీరోయిన్ ను ఎందుకు తీసుకున్నారు ?
జ) ఈ సినిమాను రెండు నెలలు యూఎస్ లో షూట్ చేయాలి. అందుకే ఎక్కువ డేట్స్ కోసం కొత్త అమ్మాయి అయితే ఈజీ అవుతుందని మేఘా ఆకాష్ ను తీసుకున్నాం. నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆమే హీరోయిన్.

ప్ర) మీ కొత్త లుక్ గురించి చెప్పండి ?
జ) ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి ముందు నేను, హను చాలా రీసెర్చ్ చేశాం. యూఎస్ వెళ్లి మరీ అన్నీ చూసుకున్నాం. నా లుక్ ను కూడా ముందే డిసైడ్ చేసుకున్నాం. అందరూ చాలా బాగుందని అంటున్నారు. ఇందులో రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాను.

ప్ర) మీ జీవితంపై త్రివిక్రమ్ గారి ప్రభావం ఎంత ఉంది ?
జ) ప్రస్తుతం ఆయనే నాకు అన్నీ. ఆయన అన్నీ తెలిసిన జ్ఞానిలా ఉంటారు. నా వ్యక్తిగత, సినిమాకు సంబందించిన అన్ని సమస్యల పరిష్కారం కోసం అయన దగ్గరకే వెళతాను. కొన్నిరోజుల క్రితం కూడా ఒక పర్సనల్ ప్రాబ్లమ్ కోసం ఆయన్ని కలిస్తే మంచి సొల్యూషన్ ఇచ్చారు.

ప్ర) చూస్తుంటే ఈ సినిమాలో కూడా పవన్ రెఫెరెన్స్ ను వాడినట్టున్నారు ?
జ) అయన సినిమాల పట్ల నా ఇష్టాన్ని చూసి అందరూ అయన స్టార్ డమ్ ను నేను ఉపయోగించుకుంటున్నాను అన్నారు. నా వరకు నేను ప్రస్తుతం మంచి పొజిషన్లోనే ఉన్నాను. అయాన్ పేరు వాడుకోవాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను. ఆయన పట్ల నా ప్రేమ తగ్గదు. ఇకపై నా ప్రతి సినిమాలో ఆయన రిఫరెన్స్ ఉంటుంది. ఆయన నా గురించి ఏమనుకుంటారో తెలీదుగానీ నాకు మాత్రం ఆయనే స్ఫూర్తి.

 
Like us on Facebook