హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీబిజీగా మారనున్నాడు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా అనౌన్స్ చేసిన నితిన్, అంతకుముందే అనౌన్స్ చేసిన మరో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా ద్వారా మరో కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కానుండడం విశేషం. సాయితేజ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవనున్న ఈ సినిమాకు మల్లాది వెంకట నారాయణ దర్శకుడు.
చోటా కె. నాయుడు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ కథ అందించగా, కృష్ణ చైతన్య స్క్రీన్‌ప్లే అందించారు. మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇక పూరీ-నితిన్‌ల కాంబోలో తెరకెక్కే సినిమాకు ‘మా అమ్మ సీతామాలక్ష్మి’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.


