యూఎస్ లో పని పూర్తి చేసిన నాని !
Published on Mar 9, 2017 8:39 am IST


ఇటీవలే ‘నేను లోకల్’ చిత్రంతో విజయం అందుకుని డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన హీరో నాని ప్రస్తుతము చేస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. ఇటీవలే నాని పుట్టినరోజు సందర్బంగా విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క షెడ్యూల్ యూఎస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు జరిగిన ఈ భారీ షెడ్యూల్ ఈరోజుటితో పూర్తయింది. దీంతో సినిమాలోని మేజర్ పార్ట్ షూట్ అయిపోయినట్టేనని తెలుస్తోంది.

నాని బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించి ఫుల్ డిమాండ్లో ఉండటం వలన ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేత థామస్ హీరోయిన్ గా నటిస్తుండగా హీరో ఆది పినిశెట్టి ఒక కీ రోల్ చేస్తున్నాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. జులై నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook