మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవా హీరోగా చేస్తున్న మూడవ చిత్రం ‘కిన్నెరసాని’. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా మొదలైంది. అయితే సినిమా మొదలైన కొన్ని రోజులకే ఆడిగిపోయిందని, మొదటి షెడ్యూల్ అవుట్ ఫుట్ నచ్చక నిర్మాతలు చిత్రీకరణ ఆపారని రకరకాల వార్తలొచ్చాయి. ఒకానొక దశలో ప్రాజెక్ట్ ఉండదనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి నెగెటివ్ గాసిప్స్ వస్తే ఏ చిత్ర బృందమైనా వెంటనే స్పందించి అసలు విషయం ఏంటో చెబుతారు.
కానీ ‘కిన్నెరసాని’ టీమ్ మాత్రం వదంతుల విషయంలో ఇన్నిరోజులు అస్సలు రియాక్ట్ కాకుండా నూతన సంవత్సరం సందర్బంగా ఫస్ట్ గ్లిమ్స్ వదిలి చివర్లో షూటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెబుతూ సినిమా ఆగిపోలేదని, నిక్షేపంలా జరుగుతోందని క్లారిటీ ఇచ్చేశారు. పైగా గ్లిమ్స్ కూడ ఆకర్షణీయంగా ఉంది. వినసొంపైన సంగీతం, అందమైన విజువల్స్ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. యంగ్ డైరెక్టర్ రమణ తేజ(అశ్వధామ ఫేమ్) దర్శకత్వంలో నిర్మాత రామ్ తాళ్లూరి సారథ్యంలో రజినీ తాళ్లూరి, రవి చింతల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


