శంకర్ – చరణ్ 15కి ఈ విషయంలో నో డౌట్..!

Published on Jul 16, 2022 1:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా దగ్గర మరో టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం రామ్ చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో 15వ సినిమాగా వస్తుండగా పాన్ ఇండియా సినిమా దగ్గర అనేక అంచనాలు అయితే నెలకొన్నాయి.

మరి ఈ సినిమాని అన్ని అంచనాలకు తగ్గట్టుగా మేకర్స్ నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ఆల్బమ్ పై అయితే చాలా మందికి ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి. శంకర్ మార్క్ గ్రాండియర్ ని తన ఫస్ట్ టైం సంగీతం అందిస్తున్న థమన్ మ్యాచ్ చేయగలడా అని..

అయితే సినీ వర్గాల నుంచి టాక్ ప్రకారం అయితే ఈ సినిమా ఆల్బమ్ గాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ ఎవరూ ఎలాంటి డౌట్ పెట్టుకోనక్కర్లేదట. ఈ అవుట్ పుట్ చాలా బాగా వస్తుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :