విశాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ…!

Published on Aug 3, 2019 10:06 am IST

తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ని లీగల్ ప్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా నడిగర్ సంఘం జనరల్ సెక్రెటరీ గా ఉన్న విశాల్ తన కార్యానిర్వాహక వర్గ జీతాలకు సంబంధిచిన పన్నులు, టీడీఎస్ సరిగా చెల్లిచలేదని,అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐ టి అధికారులు విచారణకు హాజరుకావలసిందిగా పలుమార్లు నోటీసులు పంపినా విశాల్ స్పందించక పోవడంతో అధికారులు చెన్నై లోకి ఎగ్మూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.

ఈ పిటీషన్ పై నిన్న విచారణ జరిపిన ఎగ్మూర్ కోర్ట్ ఈసారి విశాల్ విచారణకు హాజరుకాని పక్షంలో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయవలసిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసు పై పునర్విచారణ ఈనెల 28కి వాయిదా వేయడం జరిగింది.

కాగా విశాల్ ఇటీవల “టెంపర్” తమిళ రీమేక్ “అయోగ్య” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విశాల్, సుందర్ సి దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :